Chiranjeevi: అరుదైన గౌరవం స్వీకరణకు లండన్ చేరుకున్న చిరంజీవి 1 y ago
యూకే ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి లండన్ కు చేరుకున్నారు. నాలుగు దశాబ్దాలకుపైగా చిరంజీవి చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలు, వ్యక్తిగతంగా ఆయన దాతృత్వం, ఆదర్శప్రాయ కృషిని బ్రిటన్ ప్రభుత్వం గుర్తించింది. పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్ లో మెగాస్టార్‌ను సత్కరించాలని నిర్ణయించింది. రేపు పురస్కారం ప్రదానం చేయనుంది. హీత్రూ విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవికి అక్కడి అభిమానులు ఘన స్వాగతం పలికారు.